(Amaravati Nrityotsav) విజయవాడ: నటరాజ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో అమరావతి నృత్యోత్సవ్-2021 భారతీయ నృత్యోత్సవం శనివారం రాత్రి ఇక్కడి సిద్ధార్థ ఆడిటోరియంలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ భారతీయ నృత్యోత్సవాలు రెండు రోజుల పాటు జరుగనున్నాయి. తొలి రోజున ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, అసోంకు చెందిన నాలుగు బృందాలు ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకుల నుంచి కరతాళ ధ్వనులను అందుకున్నాయి.
ఇలియానా సిటారిస్టి ప్రదర్శనతో పండుగ ప్రారంభమైంది. ఇలియానా ఇటలీకి చెందిన యువతి. ఒడిస్సీ నేర్చుకోవడానికి ఒడిశాకు వచ్చి ఇక్కడే స్థిరపడింది. ఆమె అద్భుతమైన నృత్య అంశం ‘శివ లీలలు’ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నది. ఈ సందర్భంగా క్లాసికల్ డ్యాన్స్‌కు అందించిన అత్యుత్తమ సేవలకుగానూ ఇలియానాకు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు బహూకరించి సత్కరించారు. భారత ప్రభుత్వం ఇలియానా సేవలను గుర్తించి ‘పద్మశ్రీ’ అవార్డును అందజేసింది.
ఇక, విశాఖపట్నానికి చెందిన గీతా నారాయణ్ రెండు అద్భుత ప్రదర్శనలు చేశారు. తరంగం, అన్నమాచార్య కూర్పు ‘సతులారా చూడరే శ్రావణ బహులాష్టమి’ ని ప్రదర్శించి ఆహుతులను అలరించారు. తన భావాలు, భంగిమలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. జితు బోరా నేతృత్వంలోని దాదాపు 20 మంది కళాకారులతో కూడిన బృందం అద్భుతమైన అస్సామీ బిహు నృత్యాన్ని ప్రదర్శించి ప్రేక్షకులను మెప్పించింది.
గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా? అయితే, ఒకసారి ఆలోచించండి..!
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
ఈ ‘ముక్కు’ రోగాలను పసిగడుతుంది.. ఎలాగంటే?
ఈ పండు రోజూ తింటే హార్ట్ అటాక్ రాదంట..! ఆక్స్ఫర్డ్ పరిశోధకుల వెల్లడి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..