ECB : కెన్నింగ్టన్ ఓవల్ టెస్టుకు దూరమైన బెన్ స్టోక్స్(Ben Stokes) మళ్లీ ఇంగ్లండ్ కెప్టెన్‌గా వచ్చేశాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆడేందుకు సిద్ధమైన అతడిని ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ECB) మూడో టెస్టుకు సారథిగా నియమించింది. రెండో టెస్టులో 253 పరుగుల ఓటమి అనంతరం కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ హింట్ ఇవ్వడమే ఆలస్యం స్క్వాడ్ ప్రకటించింది ఈసీబీ. లండన్ నైట్‌క్లబ్ వివాదానికి స్టోక్స్‌ను బాధ్యుడిని చేయడం ఇష్టంలేక.. ఈ నిర్ణయం తీసుకుంది.
లార్డ్స్ టెస్టు అనంతరం.. నైట్ క్లబ్ వివాదంలో ఇరుక్కున్న బెన్ స్టోక్స్‌కు ఊరట లభించింది. క్రమశిక్షణ చర్యల కారణంగా రెండో మ్యాచ్‌కు దూరమైన అతడు తిరిగి కెప్టెన్సీ చేపట్టాడు. డుర్హం జట్టు తరఫున కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆడేందుకు సిద్ధమైన స్టోక్స్‌ను ఇంగ్లండ్ బోర్డు వెనక్కి పిలిచి మరీ పగ్గాలు అప్పగించింది. అలానే.. పేసర్ గస్ అట్కిన్సన్కు కూడా స్క్వాడ్‌లో చోటు దక్కింది. న్యూజిలాండ్, ఇంగ్లండ్ చెరొక మ్యాచ్ గెలిచినందున.. సిరీస్ విజేతను నాటింగ్హమ్ టెస్టు నిర్ణయించనుంది.
🚨 Ben Stokes and Gus Atkinson to join England’s squad for the third Test vs New Zealand at Trent Bridge pic.twitter.com/iiXTNBMzVM
— ESPNcricinfo (@ESPNcricinfo) June 21, 2026
ఇంగ్లండ్ స్క్వాడ్ : బెన్ డకెట్, ఎమిలియో గే, బెన్ స్టోక్స్(కెప్టెన్), జాకబ్ బెథెల్, జో రూట్, హ్యారీబ్రూక్, జేమీ స్మిత్, ఓలీ రాబిన్సన్, రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, అట్కిన్సన్, జోర్డాన్ కాక్స్, షోయబ్ బషీర్, మాథ్యూ ఫిషర్, జోష్ టంగ్.