TDP MP | ఏపీలో పొత్తులు ఖరారు..ఈ రోజే ఉమ్మడి ప్రకటన : టీడీపీ ఎంపీ కనకమేడల
TDP MP | ఆంధ్రప్రదేశ్లో మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. రాబోయే పార్లమెంట్(MP), అసెంబ్లీ(Assembly) ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీచేయడానికి రెండు రోజులుగా జరుగుతున్న చర్చలు శనివారం సఫలికృతమయ్యాయి.
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. రాబోయే పార్లమెంట్(MP), అసెంబ్లీ(Assembly) ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీచేయడానికి రెండు రోజులుగా జరుగుతున్న చర్చలు శనివారం సఫలికృతమయ్యాయి. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు కుదరిందని , శనివారం రాత్రి వరకు ఉమ్మడి ప్రకటన ఉంటుందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ (TDP MP Kanakamedala) వెల్లడించారు.
బలాబలాలను బట్టి ఎవరు ఎక్కడి నుంచి పోటీచేయాలో అనే అంశంపై తర్వాత నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. తాము అధికారం కోసం పొత్తు అవసరం లేదని, రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే పొత్తు కుదుర్చుకున్నామని ఆయన వివరించారు. గెలుపు ప్రాతిపదికన సీట్ల షేరింగ్ ప్రాక్టికల్గా ఉంటుందని అన్నారు. వైసీపీ(YCP) ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్నదే పొత్తు లక్ష్యమని తెలిపారు.
వైఎస్ జగన్రెడ్డి పాలన నుంచి ప్రజలను విముక్తి చేయడానికి, ప్రజాప్రయోజనాల కోసమే తిరిగి ఎన్డీయేలో చేరుతున్నామని స్పష్టం చేశారు. టికెట్లు రాని అభ్యర్థులతో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ చంద్రబాబు వారితో చర్చలు జరిపి టికెట్లు ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని, కొద్ది్ రోజుల్లో అసంతృప్తి మణిగిపోతుందని దీమాను వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో కేంద్రం నుంచి రావలసిన వాటి కోసం పోరాడం. సాధించాం.. మరికొన్నింటిని సాధించుకుంటామని కనకమేడల తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

