Janasena | జనసేన పార్టీకి ఎన్నికల గుర్తు ఖరారైంది. గాజు గ్లాస్ గుర్తును మరోసారి జనసేన పార్టీకే కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘానికి సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆ పార్టీకి మెయిల్ ద్వారా సీఈసీ సమాచారం అందించింది. గుర్తు కేటాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల ప్రతులను జనసేనాని పవన్ కళ్యాణ్‌కు మంగళగిరిలోని కార్యాలయంలో పార్టీ లీగల్ సెల్ చైర్మన్ సాంబశివరావు అందజేశారు.
గత సార్వత్రిక ఎన్నికలు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుతోనే జనసేన అభ్యర్థులు పోటీ చేశారు. అదేవిధంగా సీఈసీ నిర్ణయంతో ఈసారి కూడా గాజు గ్లాసు గుర్తుతోనే జనసేన అభ్యర్థులు బరిలో నిలవనున్నారు. కాగా, జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి గాజు గ్లాస్‌నే కేటాయించడం పట్ల పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.