అమరావతి : ఏపీలోని విజయనగరం జిల్లాలో ఇద్దరు అవినీతి అధికారులు ఏసీబీ( ACB ) కి చిక్కారు. జిల్లాలోని మెంటాడ సర్పంచ్ గ్రామంలో సొంత నిధులతో చేపట్టిన రూ.5 లక్షల పనుల తాలుకూ బిల్లుల మంజూరికి సంబంధిత అధికారులైన ఏఈ గౌతమ్( AE Goutham) , వర్క్ ఇన్స్పెక్టర్ సంతోష్‌ను సంప్రదించాడు.
అయితే బిల్లుల మంజూరికి రూ.1.50లక్షలు లంచం(Bribe ) డిమాండ్ చేయడంతో శనివారం ఆ డబ్బును తీసుకున్న ఇద్దరు ఉద్యోగులపై ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. ఉద్యోగ నిర్వహణలో అవినీతికి పాల్పడినందుకు గాను ఇద్దరిపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరు పరచగా కోర్టు రిమాండ్ విధించింది.