Aditya Pharmacy | ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తి రాజు ఆత్మహత్యకు పాల్పడ్డారు. విజయవాడలోని అయోధ్య నగర్లోని క్షత్రియ భవన్లో శనివారం ఉదయం ఉరివేసుకున్నారు.
తన స్నేహితుడిని హత్య చేసిన కేసులో గత ఏడాది నరసింహమూర్తిరాజు అరెస్టయ్యారు. ఇటీవలే బెయిల్ మీద వచ్చిన ఆయన.. శుక్రవారం రాత్రి హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరి వెళ్లారు. ఈ క్రమంలోనే ఆయన అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన వెళ్లి ఘటనాస్థలిని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా సూసైడ్ నోట్ దొరకడం గమనార్హం.