అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని కొందరు ఐఏఎస్ అధికారులకు (IAS Officers) ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. పరిశ్రమలశాఖ కార్యదర్శి యువరాజ్‌కు ఏపీఎస్ఎఫ్సీ(AP SFC) ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వ్యవసాయ మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్‌గా ఉన్న సునీతకు రైతు బజారు సీఈవోగా, సమాచార శాఖ డైరెక్టర్ శుక్లాకు డిజిటల్ కార్పొరేషన్ ఎండీగా అదనంగా బాధ్యతలు అందజేశారు. హౌసింగ్ కార్పొరేషన్, వీకర్ సెక్షన్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా రాజబాబును నియమించారు.