Madhavilatha | సినీ నటి, బీజేపీ నేత మాధవీలత, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వివాదం మరింత ముదురుతోంది. మాధవీలత ఒక ప్రాస్టిట్యూట్ అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న తరుణంలో.. తాజాగా ఆమె స్పందించారు. తెర మీద కనిపించే మహిళలు క్యారెక్టర్‌లెస్, గలీజ్ పని చేసే వాళ్లు అని జేసీ ప్రభాకర్ రెడ్డి అంటున్నారని.. కాబట్టి తాడిపత్రిలో ఉండే పతివ్రతలు సినిమా రంగంలోకి రావద్దని సూచించారు. మీ అందాలను, ఆలోచనలను పెళ్లికి ముందు అమ్మానాన్నలతో ఉంచి, పెళ్లి తర్వాత భర్తలకు సమర్పించుకోవాలని సెటైర్ వేశారు. జేసీని సమర్థిస్తున్న సైకోలు అందరికీ ధన్యవాదాలు అని ఎద్దేవా చేశారు. వాళ్ల బెదిరింపులకు తానేమీ భయపడట్లేదని.. తనను చంపాలని అనుకుంటే చంపొచ్చని స్పష్టం చేశారు.
‘ నిద్రలేవగానే బోలెడన్నీ మిస్డ్ కాల్స్ ఉన్నాయి.. వాట్సాప్ ఓపెన్ చేయగానే ఒక వయసైపోయిన పెద్దమనిషి నా గురించి పచ్చి పచ్చి బూతులు మాట్లాడుతూ కనిపించారు. ఆయన సంస్కారవంతమైన భాషకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నాపై కేసు కూడా ఫైల్ చేశారట.. మహిళల సంరక్షణ గురించి నేను మాట్లాడటమే నేరంగా భారతదేశంలో పరిగణించబడితే.. అలాంటివి 10 కాదు 100 వీడియోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా మీద 100 కేసులు ఎవరైనా పెట్టాలని అనుకుంటే.. దయచేసి పెట్టుకోవచ్చు.’ అని మాధవీలత ఆ వీడియోలో చెప్పారు. మహిళల ప్రాణం, మహిళల మానం మహిళలకే ఇంపార్టెంట్ కానప్పుడు నేను దానిపై స్పందించేందుకు పదే పదే సిద్ధంగా ఉన్నానని తెలిపారు. వెయ్యి కేసులు పెట్టినా వెనక్కి తగ్గేదేలేదని స్పష్టం చేశారు.
‘ ఆ పెద్ద మనిషి మాట్లాడిన భాష చాలా చాలా గొప్పగా ఉంది. వాళ్ల తాడిపత్రి మహిళలే మహిళలు, పతివ్రతలు.. పక్క ఊర్లలో ఉన్న అందరూ పతితలు అని మాట్లాడిన ఆయన గొప్ప భాష, గొప్ప సంస్కారానికి, తాడిపత్రిలో ఉండే ప్రతి పతివ్రతకు, వారిని సమర్థిస్తున్న ప్రతి పురుషుడికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆ ఊరిలో మహిళలు, పురుషులు నన్నేమీ అనలేదు. కానీ ఆ పెద్దాయనే మా ఊరి మహిళలు అని అన్నారు. మరి నేను కూడా మహిళనే కదా’ అని మాధవీలత ప్రశ్నించారు. నేనేమైనా ఒక్క బూతు మాట మాట్లాడానా? ఆ పెద్ద మనిషి పేరైనా తీశానా అని నిలదీశారు. ఆ పెద్ద మనిషి ఎవరో కూడా తెలియదని చెప్పారు. అదేదో జేసీ పార్కు అన్నాను.. ఆ జేసీ పార్క్ ఆయన కట్టించుకున్నారని నాకేం తెలుసు. తాడిపత్రికి గొప్ప చరిత్ర ఉండొచ్చు.. గంజా, సిగరెట్, మందు, డ్రగ్స్ నేర చరిత్రకు సంబంధించినవి. కాబట్టి నేరానికి ఊరి చరిత్రకు సంబంధం ఉండదని స్పష్టం చేశారు.
తాడిపత్రి నుంచి ఎంతోమంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్ల్యూయెర్స్ ఉన్నారు. వాళ్లు కూడా సినిమా యాక్టర్స్ లాంటి వాళ్లే.. తెరపై కనిపించే వాళ్లందరూ ప్రాస్టిట్యూట్స్ అని అన్నారు కాబట్టి.. దయచేసి ఎవరెవరు తెర మీద కనిపిస్తున్నారో.. భవిష్యత్తులో సినిమా రంగానికి రావాలని అనుకుంటున్నారో.. వాళ్లెవరూ రావద్దని మాధవీలత రిక్వెస్ట్ చేశారు. ‘ సినిమా రంగంలో కేవలం ప్రాస్టిట్యూట్లు మాత్రమే ఉంటారని మీ జేసీ చెప్పారని పేర్కొన్నారు. తెర మీద కనిపించే మహిళలు క్యారెక్టర్‌లెస్‌గా ఉంటారు.. గలీజ్ పనులు చేస్తుంటారు.. కాబట్టి తాడిపత్రి మహిళలందరూ పతివ్రతలు కాబట్టి ఎవరూ కూడా తెరమీద కనిపించవద్దు. మీ అందాలు కానీ, మా ఆలోచనలు కానీ, మీ రూపం కానీ కేవలం పెళ్లి వరకు మీ అమ్మానాన్నలతో ఉంచి.. పెళ్లి తర్వాత మీ భర్తకు సమర్పించాలని కోరుతున్నా’నని సెటైర్ వేశారు.
టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన నటి, బీజేపీ నేత మాధవి లత
నన్ను చంపాలనుకుంటే చంపొచ్చు.. కానీ మహిళల మాన, ప్రాణాల విషయంలో వెనక్కి తగ్గను
తెర మీద కనిపించే మహిళలు క్యారెక్టర్‌లెస్, గలీజ్ వాళ్లు అని జేసీ ప్రభాకర్ రెడ్డి అంటున్నాడు.. మరి తాడిపత్రి… https://t.co/SRiBxN0N7c pic.twitter.com/NXeDjfBJlx
— Telugu Scribe (@TeluguScribe) January 3, 2025
‘ జేసీని సమర్థిస్తున్న సైకోపాథ్స్ అందరికీ ధన్యవాదాలు. నేనైతే భయపడట్లేదు. భయమంటే ఏంటో కూడా నాకు తెలియదు. ఎందుకంటే పుట్టడం సహజం.. మరణించడం కూడా సహజమే. మధ్యలో జరిగేవన్నీ మన కర్మల్ని బేస్ చేసుకునే ఉంటాయి.. నన్ను మీరు కిడ్నాప్ చేసుకోవాలని అనుకుంటే చేసుకోవచ్చు. లేకపోతే మీరు చెప్పినట్లు మర్డర్ చేస్తారంటే కూడా చేసుకోవచ్చు. నా తలరాతలో ఏం రాసిపెట్టి ఉంటే అది జరుగుతుంది తప్ప రాయనిది ఏది జరగదు.’ అని మాధవీలత వ్యాఖ్యానించారు.