Posani Krishna Murali | ప్రముఖ టాలీవుడ్ నటుడు, వైఎస్సార్సీపీ మాజీ నేత పోసాని కృష్ణమురళి బెయిల్‌పై గుంటూరు జైలు నుంచి శనివారం విడుదలయ్యారు. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాన్, లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు, మార్ఫింగ్ కేసులో ఆయన అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ కేసులో కోర్టును ఆశ్రయించగా.. శుక్రవారం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. బెయిల్ పత్రాలు సమర్పించడం ఆలస్యం కావడంతో శనివారం విడుదలయ్యారు. ఫిబ్రవరి 26న ఏపీలోని ఓబులవారిపల్లె పోలీసులు హైదరాబాద్‌లోని ఇంట్లో పోసానిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అరెస్టు చేసి రాజంపేట కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ విధించడంతో కర్నూలు జైలుకు తరలించారు. ఆ తర్వాత బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు మంజూరు చేసింది. కర్నూలు జైలు నుంచి విడుదలయ్యే సమయంలో.. సీఐడీ పోలీసులు పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకున్నారు. తనపై మోపిన కేసుల్లో అంత తీవ్రమైనవేం కాదని పోసాని కోర్టుకు తెలిపారు.
సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్న సమయంలో ఆయన తీవ్రంగా స్పందించారు. రిమాండ్ కోసం కోర్టుకు తీసుకు వెళ్లిన సమయంలో న్యాయమూర్తితో మాట్లాడారు. తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని.. బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్యే శరణ్యమని పేర్కొన్నారు. ఏ కేసులో ఎటు తీసుకు వెళ్తున్నారో తెలియడం లేదని.. ఈ వయసులో ఇలా చేయడం సరికాదన్నారు. పీపీలు అన్యాయంగా వాదిస్తున్నారన్నారు. తనకు లైడిటెక్టర్ పరీక్షలు చేయాలని.. తప్పు చేసినట్లు తేలితో తన తల నరికివేయాలని న్యాయమూర్తి ముందు పేర్కొన్నారు. తనకు రెండు స్టంట్స్ వేశారని.. ఆరోగ్యం ఏమాత్రం సహకరించడం లేదన్నారు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా పోసానిపై 30కిపైగా ఫిర్యాదులు వచ్చాయని.. 17 ఓట్ల కేసులో నమోదైనట్లుగా న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. తాజాగా పీటీ వారెంట్‌పై సైతం పోసానికి బెయిల్ మంజూరైంది. దాంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.