తిరుమల : తిరుమల, తిరుపతి దేవస్థానం సిబ్బంది హిందూ సంప్రదాయాలకు కట్టుబడి ఉండాలన్న బోర్డు నిబంధనను ఉల్లంఘిస్తూ హిందూయేతర (Non-Hindu employees) మత కార్యకలాపాలు నిర్వహిస్తున్న 18 మంది ఉద్యోగులపై టీటీడీ (TTD ) చర్యలు తీసుకుంది. వారు ఇతర విభాగాలకు బదిలీ చేయడానికి, వీఆర్ఎస్( VRS ) తీసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఈ మేరకు చైర్మన్ బీఆర్ నాయుడు ( Chairman BR Naidu ) ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
టీటీడీలో హిందూ ఉద్యోగులు మాత్రమే పనిచేయాలని చైర్మన్ బీఆర్ నాయుడు నేతృత్వంలోని టీటీడీ బోర్డు గతంలో పేర్కొంది. 18 మంది ఉద్యోగులు హిందూయేతర సంప్రదాయాలను ఆచరిస్తున్నట్లు తేలడంతో వారిపై క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించింది. 1989 ఎండోమెంట్ చట్టం ప్రకారం, టీటీడీ ఉద్యోగులు తప్పనిసరిగా హిందూ ఆచారాలకు కట్టుబడి , ఆలయ పవిత్రత , భక్తుల మనోభావాలను అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుందని పేర్కొంది.