అమరావతి : తల్లిదండ్రుల కళలను, తన ఆశయాన్ని నెరవేర్చేందుకు ఎంబీబీఎస్ సీటు (MBBS Seat ) సాధన కోసం అహర్నిశలు కష్టపడ్డా ఫలితం రాకపోవడంతో ఓ యువతి ఆత్మహత్య (Suicide) చేసుకున్న ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషాద ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
కర్ణాటక (Karnataka) రాష్ట్రం గుల్బర్గాకు చెందిన తనూజ చిత్రదుర్గం వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు కోసం రెండుసార్లు ప్రయత్నించి విఫలమయ్యింది. మూడోసారి కూడా సీటు రాకపోవడంతో మనస్థాపానికి గురై బెంగళూరు నుంచి హోస్పేట్‌కు వెళుతూ తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఫోన్ చేసి చెప్పింది.
అనంతపురం జిల్లా రాయదుర్గం శివారు ప్రాంతంలో తాను ప్రయాణిస్తున్న రైలు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె మృతదేహం రైల్వేట్రాక్‌పై పడి ఉండడంతో ప్రమాదవాశాత్తు కాలుజారి రైలు కిందపడి చనిపోయిందని పోలీసులు భావించారు. మృతురాలి తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకుని జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించారు. ఎంబీబీఎస్‌లో సీటు రాకపోవడంతోనే ఆత్మహత్య చేసుకుందని బోరున విలపిస్తూ ఫిర్యాదు చేశారు.