అమరావతి : ఏపీలో మూడు రాజధానుల విషయమై వైసీపీ మంత్రులు తమ స్వరాన్ని పెంచుతున్నారు. అటు అమరావతి రాజధాని రైతుల పాదయాత్ర ప్రారంభమైన నాటి నుంచి యాత్ర కొనసాగే జిల్లాలకు చెంది న అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వాతావరణాన్ని వేడెక్కిస్తు న్నారు. వైఎస్ జగన్ క్యాబినెట్‌లోని యువ మంత్రి ఒకరు ఇవాళ రాష్ట్ర పాలనపై సంచలన వ్యాఖ్య లు చేశారు. రాజధాని అమరావతిపై ఏపీ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికి కొందరు ఏపీ మంత్రు లు చేస్తున్న వ్యాఖ్యలపై ఆ ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మూడు రాజధానుల ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ విధానం నుంచి తప్పు కోలేదని స్పష్టం చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభం అవుతుందని పేర్నొన్నారు. విశాఖలో రాజధానికి భూముల సేకరణ అవసరం లేదని, తక్కువ ఖర్చుతో రాజధాని చేయ వచ్చని అన్నారు. రాజధాని విశాఖ తరలించేందుకు అవసరమైన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతామని, బీచ్ ఐటీ కాన్సెఫ్ట్‌తో విశాఖను అభివృద్ధి చేయడం తమ లక్ష్యమని వెల్లడించా రు. విశాఖలో భూ అక్రమాల ఆరోపణలను టీడీపీ నిరూపించాలని డిమాండ్ చేశారు.