అమరావతి : విహారయాత్రకు వెళ్లిన విజయవాడ న్యాయవాదుల బస్సుకు రాజస్థాన్‌లో( Rajasthan) ప్రమాదం జరుగడంతో మహిళా న్యాయవాది ఒకరు మృతి చెందగా మరో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ(Vijayawada)కు చెందిన బార్ అసోసియేషన్ న్యాయవాదులు (Advocates) విహారయాత్ర కోసం రాజస్థాన్‌లోని అజ్మేర్(Ajmer,) కు రెండు బస్సుల్లో బయరు దేరారు.
మంగళవారం తెల్లవారు జామున ఆగి ఉన్న ట్రక్కును న్యాయవాదుల బస్సు ఢీ కొనడంతో ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ సతీమణి జ్యోత్స్న అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. న్యాయవాది భార్య ప్రమాదంలో మరణించడం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) సంతాపం వ్యక్తం చేశారు.
మహిళలు, విద్యార్థినులను చైతన్యపరిచే కార్యక్రమాలను జ్యోత్స్న నిర్వహించేవారని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా బస్సు ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మతో చంద్రబాబు మాట్లాడారు.