అమరావతి : ఏపీలోని శ్రీకాకుళం (Srikakulam District) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రణస్థలం మండలం పాతర్లపల్లిలో నిర్మాణంలో ఉన్న పాఠశాల అదనపు భవనానికి( School Building) చెందిన సజ్జ బుధవారం మధ్యాహ్నం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో కృష్ణంరాజు(15) అనే 8వ తరగతి విద్యార్థి మృతి చెందగా శ్రీరాములు(14) తో పాటు మరో విద్యార్థిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.
విద్యార్థి మృతి పట్ల ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విద్యార్థి కుటుంబాన్ని ఆదుకుంటామని వెల్లడించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.