అమరావతి : ఉన్నత విద్యా చదువులు చదివి కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు తన కుటుంబంతో అమెరికాకు వెళ్లాడు. అక్కడ ఎన్నో కష్టనష్టాలకోర్చి ఇప్పుడిప్పుడే స్థిర పడుతున్న సమయంలో జలపాతంలో జారి పడి మరణించడంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొని ఉంది. కృష్ణా జిల్లా పోరంకిలోని వసంతనరగ్ కాలనీకి చెందిన నెక్కలపు హరీశ్ చౌదరి(35) ఎంటెక్ పూర్తి చేసి కెనడాలో టూల్ మేకర్‌గా పనిచేస్తున్నాడు.
ఇవాళ కుటుంబ సభ్యులతో కలిసి న్యూయార్క్ ఇతాకా జలపాతాన్ని చూడడానికి విహార యాత్రకు వెళ్లారు. అయితే జలపాతం వద్ద అతడు ప్రమాదవాశాత్తు కాలు జారి అందులో పడి గల్లంతయ్యాడు. కొద్ది గంటల అనంతరం మృతదేహం నీటిలో తేలడంతో స్థానిక పోలీసులు బయటకు తీయించి ఆస్పత్రికి తరలించారు. అతడి మరణవార్త తెలుసుకున్న కృష్ణా జిల్లాలోని కుటుంబ సభ్యుల రోదనలు స్థానికుల కంట కన్నీరు తెప్పించాయి.