అమరావతి : జమ్మూకశ్మీర్లోని (Jammu Firing) సోపోర్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన ఆర్మీ జవాను పంగల కార్తీక్ (Jawan Karthik) అమరుడయ్యారు. ఆదివారం రాత్రి సోపోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జలూర గుజ్జర్ పటి ప్రాంతంలో భద్రతా దళాలు తనిఖీలు నిర్వహిస్తుండగా ఉగ్రవాదుల (Terrorists )స్థావరాన్ని గుర్తించారు.
ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో కార్తీక్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు. అత్యంత ధైర్యసాహసాలతో పోరాడి ప్రాణత్యాగం చేసిన కార్తీక్ కు భద్రతా దళాలు నివాళులు అర్పించాయి.
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం రాగిమానుపెంట గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ కార్తీక్ మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra Babu) దిగ్భ్రాంతిని , ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. జవాన్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన వెల్లడించారు. డిగ్రీ మధ్యలో ఆపేసి 2017లో సైన్యంలో చేరిన కార్తీక్ ప్రస్తుతం కశ్మీర్ లో పనిచేస్తు కాల్పుల్లో మరణించడం పట్ల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.