అమరావతి : ఏపీలోని అనంతపురం ( Anantapur district ) జిల్లా కూడేరు మండలం కమ్మూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లితో పాటు చిన్నారి మృతి చెందింది. అతి వేగంగా వచ్చిన కారు ( Car ) , ఆటో ( Auto )ను ఢీకొనగా ఈ ప్రమాదం జరిగింది. ఆటోలో ఉన్న ఇద్దరు మృతి చెందగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి . ప్రమాదంలో తల్లి సరస్వతి సహా మూడు నెలల కుమార్తె విద్యశ్రీ మృతి చెందింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.