Heart Attack | మితిమీరిన డీజే సౌండ్‌కు మరో గుండె ఆగింది. దుర్గాదేవి నిమజ్జన ఉత్సవం సందర్భంగా భార్యతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ.. అక్కడికక్కడే ఓ వ్యక్తి కుప్పకూలాడు. గుండెనొప్పితో ప్రాణాలు విడిచాడు. ఏపీ విశాఖలోని పెందుర్తి సమీపంలోని పెదగాడిలో ఈ విషాద ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే పెదగాడి గ్రామానికి చెందిన అప్పికొండ త్రినాథ్ (56), అతని భార్య లక్ష్మీ ఇద్దరూ ఆదివారం రాత్రి దుర్గాదేవి నిమజ్జనోత్సవంలో పాల్గొన్నారు. అక్కడ డీజే సౌండ్‌తో ఫుల్ జోష్‌లోకి వచ్చిన త్రినాథ్ తన భార్యతో కలిసి ఒక పాటకు సరదాగా డ్యాన్స్ కూడా చేశాడు. పాట అయిపోగానే అలా పక్కకు వెళ్లిన త్రినాథ్ ఛాతీ పట్టుకుని అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. అక్కడ ఉన్న వారు ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే త్రినాథ్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. గుండెపోటుతో త్రినాథ్ మరణించాడని వైద్యులు తేల్చారు. నిమజ్జనోత్సవంలో డీజే సౌండ్ ఎక్కువగా ఉండటంతో పాటు, ఉత్సాహంగా డ్యాన్స్ చేయడంతో శరీరంపై ఒత్తిడి పడటం వల్ల హార్ట్ ఎటాక్ వచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు.
విశాఖ పెందుర్తి..
డాన్స్ చేస్తూ మృతి చెందిన వ్యక్తి..
దుర్గాదేవి నిమ్మజ్జన ఉత్సవంలో విషాదం
డీజే సౌండ్ భరించలేక ఆగిన గుండె
ఉత్సవాల్లో డాన్స్ చేస్తూ అక్కడకక్కడే కుప్పకూలిన త్రినాథ్ (56) అనే వ్యక్తి
భార్య తో కలిసి ఉత్సాహంగా డాన్స్ చేసిన త్రినాథ్
కొద్దిసేపటి తర్వాత డాన్స్… pic.twitter.com/gSw5GnfNBt
— RTV (@RTVnewsnetwork) October 7, 2025
వాస్తవానికి ఊరేగింపుల్లో డీజే సౌండ్‌కు ఎలాంటి అనుమతి లేదు. అయినప్పటికీ ఉత్సవ నిర్వాహకులు నిబంధనలు పాటించకుండానే డీజే సౌండ్స్ పెట్టారని పోలీసులు చెబుతున్నారు.