అమరావతి : నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని గుడ్లూరు మండలం మోచర్ల జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు.రహదారి మరమ్మతు పనులు చేస్తున్న కార్మికులపై లారీ దూసుకెళ్లడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ కార్మికులను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా చాగల్లు, సింగరాయకొండ, మన్నేటికోట వాసులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.