అమరావతి : ఏపీలో రోడ్డు ప్రమాదాలు (Road Accident ) కలవరపాటుకు గురిచేస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది చనిపోయిన ఘటనను మరవకముందే అన్నమయ్య జిల్లాలో (Annamaiah District) మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
జిల్లాలోని రామాపురం మండలం మేదరపల్లి చెక్‌పోస్టు వద్ద మంగళవారం 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు(RTD Bus) ను సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంతో గాయపడ్డ ప్రయాణికులను పోలీసులు కడప, రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. లారీ, బస్సు ఇరుక్కుపోవడంతో జేసీబీ సహాయంతో వాహనాలను అక్కడి నుంచి తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.