శ్రీశైలం, ఏప్రిల్ 21 : శ్రీశైలం రిజర్వాయర్‌ను మంగళవారం కేఆర్ఎంబీ బృందం పరిశీలించింది. తెలుగు రాష్ర్టాలకు కేటాయించిన నీటి నిల్వలతోనే విద్యుదుత్పత్తి చేసుకోవాలని జెన్కో అధికారులకు కేఆర్ఎంబీ చైర్మన్ సుబ్రాంగ్ షూ బిశ్వాస్‌తోపాటు ఇద్దరు సభ్యులు సూచించారు. మంచినీటి అవసరాలకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న నీటి నిల్వ ల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
వ్యూపాయింట్ వద్ద ఇరిగేషన్, జెన్కో అధికారులతో సమావేశమై నీటి నిల్వలు, విద్యుదుత్పత్తికి వినియోగించిన నీటి సామర్థ్యం, ఉత్పత్తి చేసిన యూనిట్ల వివరాలను సమగ్ర నివేదికల రూపంలో సేకరించారు. అనంతరం కుడి, ఎడమ జల విద్యుత్తు కేంద్రాలు, ఎస్ఎల్బీసీ టన్నెల్‌ను పరిశీలించారు. బుధవారం పోతిరెడ్డిపాడు, కర్నూలు ప్రాంతాల్లో పర్యటించనున్నట్టు ఇరిగేషన్ అధికారులు తెలిపారు.