అమరావతి : వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసు, అటవీశాఖ ఉద్యోగుల వాహనాలపై దూసుకొచ్చిన లారీ కారణంగా ఓ అటవీశాఖ ఉద్యోగి (Forest Employ Died) మరణించాడు. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. తిరుపతి(Tirupati) జిల్లా తొట్టంబేడు మండలం పెద్దకన్నలి వద్ద జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
కర్రల లోడ్ ట్రాక్టర్‌ను రోడ్డుపక్కన ఆపి పోలీసులు మాట్లాడుతుండగా వెనుక నుంచి వచ్చిన గ్యాస్ సిలిండర్ల లారీ పోలీసు వాహనం, ట్రాక్టర్‌ను ఢీ కొట్టింది. దీంతో పోలీసు వాహనంలో ఉన్న అటవీ శాఖ ఉద్యోగి వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందగా ఇద్దరు కానిస్టేబుళ్లకు స్వల్పగాయాలయ్యాయి. గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. గ్యాస్ సిలిండర్ లారీ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.