తిరుమల : నిజామాబాద్ ( Nizamabad)కు చెందిన కటకం శ్రీనివాస్ అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు మంగళవారం రూ.10 లక్షలు విరాళంగా (Donation) అందించారు. ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా నిన్న 82,650 మంది భక్తులు దర్శించుకోగా 23,331 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల శ్రీవారి హుండీకి రూ. 4.08 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వివరించారు. మంగళవారం ఉదయం వరకు 31 కంపార్టుమెంట్లలో స్వామివారి దర్శనానికి భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 13 గంటల్లో సర్వదర్శనం అవుతుందని తెలిపారు.