Dead body | ఇల్లు కట్టేందుకు తెచ్చుకున్న ఇసుకలో శవం..!
Dead body | ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక మాఫియా ఇష్టారీతన వ్యవహరిస్తోందని రుజువు చేసే మరో ఘటన వెలుగుచూసింది. శ్మశానాలను కూడా వదలకుండా తవ్వేస్తున్నారు. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో ఇంటి నిర్మాణం కోసం ఇసుక తెప్పించుకుంటే.. అందులో శవం బయటపడింది. ఘటనపై ఆ ఇంటి యజమానురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Dead body : ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక మాఫియా ఇష్టారీతన వ్యవహరిస్తోందని రుజువు చేసే మరో ఘటన వెలుగుచూసింది. శ్మశానాలను కూడా వదలకుండా తవ్వేస్తున్నారు. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో ఇంటి నిర్మాణం కోసం ఇసుక తెప్పించుకుంటే.. అందులో శవం బయటపడింది. ఘటనపై ఆ ఇంటి యజమానురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. పద్మనాభంపేటలో నివాసముంటున్న కాగితాల లక్ష్మి నూతనంగా ఇంటి నిర్మాణం చేపట్టారు. బేస్ మట్టం పూడ్చేందుకు స్థానిక వ్యాపారులతో మాట్లాడి ట్రాక్టర్లతో ఇసుక తోలించారు. ఇంటి పని కోసం వచ్చిన కూలీలు బేస్ మట్టాన్ని నింపేందుకు ఇసుక తీస్తుండగా అందులో ఓ వ్యక్తి శవం బయటపడింది. దాంతో భయాందోళనకు గురైన కూలీలు విషయాన్ని ఇంటి యజమానికి తెలియజేశారు.
ఇంటి యజమాని లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇసుకలో బయటపడ్డ మృతదేహాన్ని రెండు రోజుల క్రితం పూడ్చిపెట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. జేసీబీతో ఇసుక తవ్వే క్రమంలో తల ఊడిపోయి ఉంటుందని, అందుకే మొండెం మాత్రమే మిగిలిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
చీరాల రూరల్ సీఐ సత్యనారాయణ ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. మృతదేహం ఎక్కడిది..? ఇసుక ఎక్కడ నుంచి తరలించారు..? ఇసుకలో మృతదేహం ఎలా వచ్చింది..? అసలు ఏం జరిగి ఉంటుంది..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

