తిరుమల : తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారని వారు వివరించారు. నిన్న శ్రీవారిని 78,188 మంది భక్తులు దర్శించుకోగా 35,427 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.94 కోట్లు వచ్చిందని పేర్కొన్నారు.
టీటీడీ రాష్ట్ర రైతు సాధికార సంస్థ కలిసి ఎంపిక చేసిన 20 మంది సేంద్రియ వ్యవసాయ రైతులకు రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో ఉచితంగా గోవులను పంపిణీ చేశారు.తిరుమల తిరుపతి దేవస్థానం అందిస్తున్న గోవులను గోవిందుని వరప్రసాదంగా భావించి సేంద్రియ రైతులు స్వీకరించాలని, గో ఆధారిత వ్యవసాయం చేసి పోషక విలువలతో కూడిన ఆహార ఉత్పత్తులు పండించాలని సూచించారు.