తిరుమల : తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 16 కంపార్టుమెంట్లలో (Compartments) వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు (TTD ) వివరించారు. నిన్న స్వామవారిని 63,731 మంది భక్తులు దర్శించుకోగా 22,890 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న మొక్కుల ద్వారా హుండీకి రూ. 3.94 కోట్లు ఆదాయం (Income) వచ్చిందన్నారు.
వ్యాసరాజ మఠాధిపతిని మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ ఈవో
వ్యాసరాజ మఠాధిపతి విద్యాశ్రీశతీర్థ స్వామిజీని టీటీడీ ఈవో జె.శ్యామలరావు దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్వామిజీ ఈవో దంపతులకు ఆశీర్వచనం అందించారు. ఇటీవల కాలంలో భక్తులకు టీటీడీ అందిస్తున్న సేవలు అద్భుతంగా ఉన్నాయని ఈవోను స్వామిజీ అభినందించారు.