తిరుమల : తిరుమలలో ( Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేంకటేశ్వరస్వామిని దర్శించు కునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 15 కంపార్టుమెంట్లలో వేచియుండగా టోకెన్లు లేని వారికి 6 గంటల్లో సర్వదర్శనం(Sarvadarsan) కలిగిందని టీటీడీ (TTD) అధికారులు వెల్లడించారు.
నిన్న స్వామివారిని 65,887 మంది భక్తులు దర్శించుకోగా 25,725 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.88 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.
13న శ్రీ తిరుమంగై ఆళ్వార్ సాత్తుమొర
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో డిసెంబరు 13l తిరుమంగై ఆళ్వార్ సాత్తుమొర జరుగనుంది. ఈ ఆలయంలో డిసెంబరు 4 నుంచి తిరుమంగై ఆళ్వార్ ఉత్సవం జరుగుతోంది. సాత్తుమొర సందర్భంగా డిసెంబరు 13న సాయంత్రం 5.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామివారు, తిరుమంగై ఆళ్వార్ ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు.