అమరావతి: విజయనగరంలోని ఓ దుకాణం నుంచి దొంగలు 5 కిలోల బంగారాన్ని దోచుకెళ్లారు. పట్టణంలోని ఒకటవ పోలీసు స్టేషన్ సమీపంలో ఉన్న గంట స్తంభం వద్ద ఓ నగల దుకాణంలో రాత్రి దొంగలు దుకాణం పై కప్పు తొలగించి లోనికి చొరబడ్డారు. మంగళవారం దుకాణానికి సెలవు కావడంతో ఈరోజు యజమాని దుకాణానికి రాగా నగల పెట్టెలు ఖాళీగా ఉండడాన్ని గమనించాడు. దీంతో యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డీఎస్పీ అనిల్‌కుమార్, సీఐ శ్రీనివాసరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
క్లూస్, డాగ్‌స్క్వాడ్ బృందాలు ఆధారాలు సేకరించారు. దుకాణంలోని సీసీ కెమెరాల దిశను మార్చి చోరీకి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.