అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని బ్రహ్మంగారి మఠం మండలం డి.అగ్రహారం వద్ద లారీ, కారు ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను కడపలోని సర్వజన దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉన్నది.