అమరావతి : ఏపీలో మెగా డీఎస్సీ(Mega DSC) కి ముందు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET exams )లు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. రెండు సెషన్లలో జరిగే పరీక్షలకు సంబంధితశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 21 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయని అధికారులు వెల్లడించారు.
దివ్యాంగులకు అదనంగా 50 నిమిషాల సమయం కేటాయించినట్లు తెలిపారు. అభ్యర్థులు ఎవరైనా ఒకటి కంటే ఎక్కువ హాల్ టికెట్లు పొందితే ఏదో ఒక కేంద్రంలో మాత్రమే హాజరుకావాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 108 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు.
సుమారు 4,27,300 మంది అభ్యర్థులు టెట్ పరీక్షను రాయనున్నారు. ఏపీలోని 22 జిల్లాల్లో 95 కేంద్రాలు, హైదరాబాద్ ( Hyderabad) , బెంగళూరు, చెన్నై, ఖమ్మం, బరంపూర్, గంజాంలో 13 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. పరీక్షా సమయానికి గంటన్న ముందుగానే కేంద్రాల్లోకి అనుమతిస్తారని చెప్పారు. అభ్యర్థులు హాల్టికెట్, గుర్తింపుకార్డు తప్పనిసరి అని తెలిపారు.