అమరావతి : ఏపీలోని ఏలూరు జిల్లాలో పోలీసులు 350 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ద్వారకా తిరుమల మండలం కప్పలకుంట జాతీయ రహదారిపై పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులను చూసి స్మగ్లర్లు ఇన్నోవా కారును వదిలిపెట్టి పారిపోయారు. కారును సోదా చేయగా అందులో ఉన్న 350 కిలోల గంజాయిని కారును స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పారిపోయిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.