Tirupati | తిరుపతి జిల్లా చంద్రగిరి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐతేపల్లి వద్ద బస్సు అదుపు తప్పిన బస్సు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 35 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. తిరువన్నమలై నుంచి తిరుపతికి వెళ్తుండగా బస్సు ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో చాలామంది ప్రయాణికులు బస్సులోనే ఇరుక్కుపోయారు. బస్సు ప్రమాదం గురించి తెలిసిన స్థానికులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసుకొచ్చారు. కాగా, డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా అనుమానిస్తున్నారు.