అనంతపురం జిల్లా గుత్తి మండలం వన్నెదొడ్డి వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. హైదరాబాద్ నుంచి ధర్మవరం వెళ్తుండగా 44వ నంబర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో బస్సులో ఉన్న 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలిని పరిశీలించారు. ప్రమాదానికి గురైన బస్సును కేకే ట్రావెల్స్ బస్సుగా గుర్తించారు. గాయపడిన ప్రయాణికులను ఆస్పత్రికి తరలించారు. కాగా, ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి బస్సు అదుపుతప్పిందని ప్రయాణికులు తెలిపారు. బస్సు మూడు పల్టీలు కొట్టి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లిందని వివరించారు.
టైర్ పేలడంతో బోల్తా పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
అనంతపురం జిల్లా గుత్తి మండలం వన్నెదొడ్డి గ్రామ సమీపంలో టైరు పేలిపోయి డివైడర్ను ఢీకొని, పక్కనే గుంతలో పడిపోయిన కేకే ట్రావెల్స్ బస్సు
ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ఉండగా, గాయాల పాలైన 13 మందిని ఆసుపత్రికి తరలించిన స్థానికులు… pic.twitter.com/sN2NVN52zk
— Telugu Scribe (@TeluguScribe) May 26, 2026