తిరుమల : దేశంలోని నలుమూలల నుంచి వస్తున్న భక్తులతో తిరుమల కిటికిటలాడుతుంది. కొండపై ఉన్న కంపార్టుమెంట్లు నిండి ఏటీజీహెచ్ వరకు భక్తులు క్యూలైన్లలో నిలిచి ఉన్నారు. వీరికి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు . నిన్న స్వామివారిని 72,216 మంది భక్తులు దర్శించుకోగా 32,338 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 5.65 కోట్లు వచ్చిందని వెల్లడించారు.