హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. జలాశయానికి 30,595 క్యూసెక్కుల వరద వస్తున్నది. ఎగువ నుంచి ప్రవాహం వస్తుండటంతో 44,377 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదలచేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుకాగా, ప్రస్తుతం 877.10 అడుగుల వద్ద నీరు ఉన్నది. ప్రాజెక్టు గరిష్ఠ నీటినిల్వ 215.80 టీఎంసీలకుగాను 173.46 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.