తిరుమల: వేసవి సెలవుల కారణంగా తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వడ్డికాసుల వాడు వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ(TTD) అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 73,811 మంది భక్తులు దర్శించుకోగా 34,901 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం(Hundi Income) రూ. 3.19 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.