అమరావతి : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనానికి భక్తులు 30 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 72,851 మంది భక్తులు దర్శించుకోగా 34,404 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.73 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.
కాగా అక్టోబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను రేపు ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. వార్షిక బ్రహ్మోత్సవాలలో సర్వదర్శనం మాత్రమే ఉంటుందని ప్రకటించినట్లుగా అక్టోబర్లో బ్రహ్మోత్సవం తేదీల్లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను నిలిపివేయడం జరిగింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి తదనుగుణంగా తమ దర్శనాన్ని బుక్ చేసుకోవాల్సిందిగా టీటీడీ కోరింది .