King Cobra | పార్వతీపురం మన్యం జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కిచ్చాడ (Kichchada)లోని ఓ ఇంట్లో గిరినాగు (King Cobra) ప్రత్యక్షమైంది. బాత్రూమ్ (bathroom)లో దాదాపు 16 అడుగుల కింగ్‌కోబ్రా బుసలు కొడుతూ కనిపించింది. ఉదయం బాత్రూమ్లోకి వెళ్లిన ఇంటి యజమాని పామును చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు. వెంటనే గట్టిగా అరుస్తూ బయటకు పరుగులు తీశాడు. అనంతరం స్నేక్ క్యాచర్స్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్స్ హుటాహుటిన అక్కడికి చేరుకుని అతికష్టంమీద గిరినాగును బంధించారు. అనంతరం దాన్ని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Also Read..
RTC buses | ఆర్టీసీ బస్సులతో రేసింగ్.. వాహనదారుల ఆగ్రహం.. వీడియో వైరల్
Heavy Rain | హైదరాబాద్‌లో మొదలైన వర్షం.. సాయంత్రానికి దంచికొట్టనున్న వాన..!
Line Of Control: నియంత్రణ రేఖ వద్ద కాల్పులు.. భారత జవాను మృతి