Line Of Control: నియంత్రణ రేఖ వద్ద కాల్పులు.. భారత జవాను మృతి
Line Of Control: జమ్మూకశ్మీర్‌లోని ఉరి సెక్టార్ సమీపంలో ఇవాళ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. నియంత్రణ రేఖ వద్ద జరిగిన కాల్పుల్లో ఓ సైనికుడు మృతిచెందాడు.
ఉరి: జమ్మూకశ్మీర్‌లోని ఉరి సెక్టార్ సమీపంలో ఇవాళ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. నియంత్రణ రేఖ(Line Of Control) వద్ద జరిగిన కాల్పుల్లో ఓ సైనికుడు మృతిచెందాడు. ఇండియా, పాక్ సైనిక దళాలు ఫైరింగ్‌కు దిగాయి. చొరబాటు యత్నాన్ని ఆపే సమయంలో ఈ ఘటన జరిగింది. ఆర్మీ వర్గాల ప్రకారం.. ఆగస్టు 12వ తేదీ రాత్రి కొందరు చొరబాటుకు ప్రయత్నించారు. అయితే రెగ్యులర్‌కు భిన్నంగా ఈ చొరబాటు సాగినట్లు చెబుతున్నారు. చొరబాటుదారులకు అండగా పాకిస్థాన్ ఆర్మీ ఫైరింగ్ జరిపినట్లు తెలుస్తోంది.
పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీమ్‌లు ఈ ప్రయత్నానికి సహకరించినట్లు స్పష్టమవుతోంది. చొరబాటు జరిగే సమయంలో.. ఎదురుకాల్పులు జరిగాయి. ఆ సమయంలో గాయపడ్డ జవాను ఆ తర్వాత ప్రాణాలు కోల్పోయాడు. అయితే వాతావరణం సరిగా లేకపోవడంతో..ఆ వెదర్లో చొరబాటుదారులు తప్పించుకున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

