అమరావతి : ఆంధ్రప్రదేశ్లో రోజువారీగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,597 కరోనా కేసులు నమోదయ్యాయి. 8 మంది బాధితులు కరోనాతో మృతి చెందారు. ఈనెల 4వ తేదీన 3,396 కేసులు 5న 2,690 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ కాగా ఈ రోజు 1,597 కేసులు నమోదయ్యాయి. నిన్నటి కంటే 1,093 కేసులు తగ్గుముఖం పట్టాయి .