అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జంగారెడ్డిగూడెంలో (Jangareddygudem) వరుస మరణాలు కలకలం సృష్టిస్తున్నాయి. జంగారెడ్డిగూడెంలో రెండు రోజుల వ్యవధిలో 15 మంది మృతిచెందారు. మృత్యువాత పడ్డవారిలో కొందరిలో వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి లక్షణాలతో దవాఖానలో చేరడం.. గంటల వ్యవధిలో మృతి చెందడం మిస్టరీగా మారింది.
అయితే మృతుల్లో ఎక్కువమందికి మద్యం అలవాటు ఉందని, కల్తీ సారా తాగి చనిపోయారని కొందరు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కాగా, వరుస మరణాలతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టణంలో దాడులు నిర్వహించారు. నాటుసారా బట్టలీను ధ్వంసం చేశారు.