AP News | అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటివరకు దాదాపు 14 మంది మరణించారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రత భారీగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో బుధవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో రియాక్టర్ పేలింది. భారీ పేలుడు కారణంగా మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి పలువురు కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. ఈ ఘటనలో కాలిన గాయాలతో ఏడుగురు మృతిచెందగా.. మొదటి అంతస్తు శ్లాబు కిందపడటంతో ఏడుగురు మరణించారు. గాయపడిన వారిలో ఐదుగురు 60 శాతానికి పైగా కాలిన గాయాలతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 300 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం.