అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 138 కరోనా కేసులు నమోదయ్యాయని ఏపీ వైద్య అధికారులు వెల్లడించారు. కరోనాతో ఒకరు మృతి చెందగా దీంతో మొత్తం మరణాల సంఖ్య 14,445 చేరుకున్నాయి. ప్రస్తుతం ఏపీలో 2,157 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కరోనా నుంచి 20,56,788 మంది కోలుకున్నారని, ఏపీలో ఇప్పటి వరకు 3,05,07,005 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నారు.