కడప : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కడప జిల్లాలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రాజంపేట బస్సుల ఘటనలో 12 మంది మృతి చెందారు. పలువురు ప్రాణాలతో బయటపడ్డారు. గండ్లూరులో ఏడుగురి మృతదేహాలను గుర్తించగా, రాయవరంలో ముగ్గురు, మందపల్లిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. శుక్రవారం ఉదయం రాజంపేట – నందలూరు మధ్య వరద నీటిలో 3 ఆర్టీసీ బస్సులు చిక్కుకున్నాయి. బస్సుల్లో చిక్కుకున్న పలువురిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది.
కడప జిల్లా :రాజంపేట నందలూరు మధ్యలో రామాపురం వద్ద నదిలో చిక్కుకున్న బస్సును బయటకు తీస్తున్న పోలీసులు పైర్ సిబ్బంది pic.twitter.com/N3sD2OnaOw
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) November 19, 2021
@APPOLICE100 @NDRFHQ pic.twitter.com/L4oXQpqZwe
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) November 19, 2021