తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సర్వదర్శనానికి భక్తులు 18 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. వీరికి 12 గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. నిన్న స్వామివారిని 80,312 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,538 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 5.14 కోట్లు వచ్చాయని తెలిపారు.