అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 108 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటలో్ కొవిడ్ తో ఒకరు మృతి చెందగా మరో 141 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,878 కరోనా యాక్టివ్ కేసులున్నాయని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ సోమవారం విడుదల చేసిన ప్రత్యేక బులిటిన్‌లో వెల్లడించింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు రాష్ట్రంలో 21,010 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించామని అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో 20,72,081 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,55,736 మంది కోలుకున్నారని పేర్కొన్నారు. చిత్తూరు, ఈస్ట్‌గోదావరి, విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదు అయ్యాయి.