Cotton crop | తెల్ల బంగారంగా పిలువబడే ప్రత్తి తెలంగాణా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పండించే ప్రధానమైన పంట. దేశంలో మహారాష్ట్ర, గుజరాత్ తర్వాత తెలంగాణ రాష్ట్రం ప్రత్తి సాగు విస్తీర్ణం, ఉత్పత్తిలో మూడో స్థానంలో ఉండి జాతీయోత్పత్తిలో ముఖ్య భూమిక పోషిస్తున్నది. అయితే, వరుసగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో ప్రత్తి చేన్లు నీట మునిగిపోయాయి. నీరు నిండిపోయిన చేలల్లో ఎలాంటి యాజమన్యా పద్ధతులు పాటించడం ద్వారా ప్రత్తి పంటను కాపాడుకుని అధిక దిగుడబడిని సాధించవచ్చో తెలుసుకుందాం.
సాగుకు అనువైన నేలలు
లోతైన నల్ల రేగడి నేలలు ప్రత్తి సాగుకు అనుకూలం. నీటి వసతి గల మధ్యస్థ భూముల్లో కూడా ప్రత్తి పంటను సాగు చేసుకోవచ్చు. ఇసుక నేలలు, మరీ తేలిక పాటి చల్కా భూములు ప్రత్తి సాగుకు వర్షాధారంగా అనుకూలం కావు. ఉదజని సూచిక 6 నుంచి 8 గల భూముల్లో ప్రత్తిని సాగు చేయవచ్చు.
అనుకూలమైన సమయం
ప్రత్తి సాధారణంగా ఏకవార్షిక పంట. ఇది ఖరీఫ్ సాగకు అనుకూలమైన పంట. పంటకాలం దాదాపు ఏడు నుండి ఎనిమిజి నెలలు. దీనిని జూన్, జులై నెలలో విత్తుకోవచ్చు. వర్షాధారంగా జులై 20 తరువాత ప్రత్తిని విత్తితే దిగుబడులు బాగా తగ్గుతాయి.
నీటి వసతి ఉన్న చోట ప్రత్తిని మే చివర లేద జూన్ మొదటి పక్షంలో విత్తుకుంటే దిగుబడులు బాగా వస్తాయి. తొలకరిలో కనీసం 60 మి.మీ. వర్షం కురిసిన తర్తాత మంచి తేమలో ప్రత్తిని విత్తుకుంటే, భూమిలో వేడి తగ్గి, మొలక శాతం బాగుంటుంది.
వానాలు తగ్గిన తర్వాత..
ప్రత్తి పంట ఎండిపోవడం గమనించిన చోట కాపర్ ఆక్సిక్లోరైడ్ @ 3 గ్రా./లీ (లేదా) కార్బండాజిమ్ @ 1 గ్రా. లీటరు నీటికి కలిపి 5-7 రోజుల వ్యవధిలో రెండుసార్లు మొక్కల అడుగుభాగం తడిచేటట్లు పిచికారి చేయాలి.
పంట త్వరగా కోలుకోవడానికి నీటిలో కరిగే ఎరువులైన పాలిఫీడ్ (19:19:19) (లేదా) మాల్టీ-కే (లేదా) యూరియా @ 10గ్రా. లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పోషకాలను పంటపై పిచికారి చేయాలి.
భూమిలో తగిన తేమ ఉన్న సమయంలో గుంటుక/గోర్రుతో అంతర కృషి చేసి కలుపును నివారించుకోవాలి.
విత్తిన 25-30 రోజులలో వచ్చే గడ్డి జాతి మరియు వెడల్పాకు కలుపు మొక్కలను నివారించడానికి పైరిథాయోట్యాక్ సోడియం @ 1.25 మి.లీ. (+) క్విజలోఫాఫ్ ఈథైల్ @ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
పంట రక్షణకు జాగ్రత్తలు
పంటను చీడపీడల బారీ నుండి కాపాడుకునేందుకు కార్బండాజిమ్ @ 1గ్రా. (లేదా) ఫ్రోపికోనాజోల్ @1 మి.లీ.. వేపనూనె (1500 పీపీఎం) @5మి.లీ. (లేదా) ఫిప్రోనిల్ @ 2 మి.లీ (లేదా) ఏసీపీట్ @ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పంటపై పిచికారి చేయాలి.