Cotton and diseases | తెల్ల బంగారంగా పిలువబడే ప్రత్తి తెలంగాణా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పండించే ప్రధానమైన పంట. దేశంలో తెలంగాణ రాష్ట్రం ప్రత్తి సాగు విస్తీర్ణం, ఉత్పత్తిలో మూడో స్థానంలో ఉండి జాతీయోత్పత్తిలో ముఖ్య భూమిక పోషిస్తున్నది. లోతైన నల్ల రేగడి నేలలు ప్రత్తి సాగుకు అనుకూలం. నీటి వసతి గల మధ్యస్థ భూముల్లో కూడా ప్రత్తి పంటను సాగు చేసుకోవచ్చు. ఇసుక నేలలు, మరీ తేలిక పాటి చలక భూములు ప్రత్తి సాగుకు అనుకూలం కావు. ఉదజని సూచిక 6 నుంచి 8 గల భూముల్లో ప్రత్తిని సాగు చేయవచ్చు. కొన్ని రకాల యాజమాన్య పద్ధతులను అనుసరించడం ద్వారా పత్తిలో వచ్చే వ్యాధులను రూపుమాపి పెద్దమొత్తంలో లాభాలను అందుకోవచ్చు.
ప్రత్తి సాగులో రైతాంగమంతా కూడా కాయ తొలుచు పురుగులను తట్టుకునే బిటి హెబ్రిడ్లనే వాడుతున్నారు. ఇవన్ని కూడా ప్రైవేటు కంపెనీలకు చెందిన వంగడాలే కావున రైతులు తమ ప్రాంతానికి అనువైన వంగడాలను, ఆయా ప్రాంతాలలో వాటి దిగుబడులను మరియు సామర్థాన్ని బట్టి ఎంపిక చేసుకోవాలి. ప్రత్తి సాగు చేయు భీములలో ప్రతీ సంవత్సరం ఎకరాకు 4 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువు లేదా ఇతర సేంద్రీయ ఎరువును దుక్కిలో చల్లి కలియదున్నాలి.
సాధారణ / సూటి రకాలను ఎకరాకు 36 కిలోల నత్రజని, 18 కిలోల భాస్వరం, 18 కిలోల పొటాష్ ఎరువులను వేయాలి. హైబ్రిడ్ రకాలను ఎకరాకు 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాష్ ఎరువులను వేయాలి. ఎక్కువకాలం ప్రత్తి సాగు చేస్తున్న భూముల్లో ప్రత్యేకంగా వేరు తెగుళ్ళు ఆశించే భూముల్లో పంట మార్పిడి చేపట్టడంతో పాటు ఎకరాకు 200 కిలోల వేపపిండిని రెండు, మూడు సంవsత్సరాలు వేయాలి. లేనట్లయితే జింకు,మెగ్నీషియం, బోరాన్ వంటి సూక్ష్మపోషకాల లోపం కనిపిస్తుంది.
పచ్చదోమ
ఎక్కువ వర్షపాతం, మబ్బులతో కూడుకున్న వాతావరణంలో ఈ పురుగు ఎక్కువగా వృధ్ది చెందుతుంది. తొలి దశలో విచ్చలవిడిగా రసాయన మందులను పిచికారి చేయకుండా కాండానికి మందు పూసే పద్దతిని పాటించాలి. 30,45 రోజుల్లో మోనోక్రోటోఫాస్, నీరు 1:4 నిష్ప్తత్తిలో, 60 రోజుల వయస్సులో ఇమిడాక్లోప్రిడ్, నీరు 1:20 నిష్ప్తత్తిలో పూయాలి. మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా ఫిప్రోనిల్ 2 మి.లీ. లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రా. లేదా ఎసిఫేట్ 75 యస్పీ 1.45 గ్రా. లేదా ఫ్లేనికామిడ్ 0.3 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
పేరుబంక
బెట్ట వాతావరణంలో, చలి కాలంలో దీని ఉధృతి ఎక్కువగా ఉంటుంది. నివారణకు పంట తొలి దశలో కాండానికి ముందు పూత 30, 45 రొజులలో మోనోక్రోటోఫాస్, నీరు 1:4 నిష్ప్తత్తలో మరియు 60 రోజుల వయస్సులో ఇమిడాక్లోప్రిడ్, నీరు 1:20 నిష్ప్తత్తలో పూయాలి. ఎసిటామిప్రిడ్ 0.2 గ్రా. లేదా ఫిప్రోనిల్ 2 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మి.లీ. లేదా థయోమిథాక్సమ్ 0.2 గ్రా. లీటరు నీటికి కిలిపి పిచికారి చేయాలి.
తామరపురుగు
ఎక్కవగా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మాసం వరకు ప్రత్తిని ఆశిస్తాయి. పంట తొలి దశలో సింథటిక్ పైరిత్రాయిడ్, ఆర్గనోఫాస్ఫేట్ మందులను విచ్చలవిడిగా పిచికారి చేయకూడదు. కాండానికి ముందు పూత 30, 45 రొజులలో మోనోక్రోటోఫాస్, నీరు 1:4 నిష్ప్తత్తలో మరియు 60 రోజుల వయస్సులో ఇమిడాక్లోప్రిడ్, నీరు 1:20 నిష్ప్తత్తలో పూయాలి. లీటరు నీటికి ఫిప్రోనిల్ 2 మి.లీ. లేదా ఎసిఫేట్ 75 యస్ పి 1.5 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మి.లీ. లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా ట్రైజోఫాస్ 2 మి.లీ, లేదా డైఫెన్ థాయీరాన్ 1.25 గ్రా. లేదా స్ప్రైరోమెసిఫెన్ 1 మి.లీ. లేదా థయోమిథాక్సమ్ 0.2 గ్రా. పిచికారి చేయాలి. వీలైనంత వరకు పై పురుగు మందులతో పాటు వేప సంబంధ మందులను కలిపి పిచికారి చేయాలి.
ఎర్రనల్లి
పైరు, పిందె, కాయ దశలలో బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు ఆశిస్తాయి. పంట తొలి దశలో సింథటిక్ పైరిథ్రాయిడ్, నియో నికోటినాయిడ్ మందులను విచ్చలవిడిగా పిచికారి చేయకూడదు. నీటిలో కరిగే గంధకము 3 గ్రా. లేదా స్పైరోమెసిఫెన్ 1 మి.లీ. లేదా డైకోఫాల్ 5 మి.లీ. లీటరు నీటికి కలుపుకొని మందులను మారుస్తూ పిచికారి చేయాలి.
పిండినల్లి
పిండినల్లి ఎక్కువగా ప్రత్తి విత్తనాల ద్వారా.. గాలి, చీమలు, నీటి పారకం, వర్షాలు, పక్షులు, మనుషులు, పశువుల ద్వారా ఒక చోట నుంచి మరొక చోటికి వ్యాపిస్తాయి. దీని నివారణకు ఫ్రొఫెలోఫాస్ 50 ఈసీ లేదా మిథైల్ పారాథియాన్ 50 ఈసీ. 3 మి.లీ. లేదా ఎసిఫేట్ 2 గ్రా. + ట్రైటాన్ లేదా సాండోవిట్ లాంటి జిగురు మందులను 1 మి.లీ. చొప్పున లీటరు నీటికి కలిపి మొక్క పూర్తిగా తడిచేటట్లుగా పిచికారి చేయాలి.
నివారణా చర్యలు