Cage Fish farming | చేపల పెంపకం తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందేందుకు అవకాశాలు ఉన్న వ్యాపారం. ప్రపంచ వ్యాప్తంగా చేపలకు డిమాండ్ పెరుగుతోంది. మన దేశంలో కూడా 70 శాతం మంది కంటే ఎక్కువ మంది చేపలను ఆహారంగా తీసుకుంటారు. వీటికి డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణం చేపలు రుచికరమైనవిగా ఉండటమే కాకుండా వాటిలో అనేక ప్రోటీన్లు, విటమిన్లు లభిస్తాయి. చేపల పెంపకంలో అనేక పద్ధతులను అవలంభిస్తున్నారు. వీటిలో కేజ్ ఫిషింగ్ పద్దతి ఒకటి. ఈ పద్ధతిలో చేపలను పెంచడం ద్వారా ఎక్కువ లాభాలను ఒడిసిపట్టుకోవచ్చు.
బోనులో చేపల పెంపకం ప్రక్రియను మారికల్చర్ అంటారు. చేపల పెంపకం కోసం పంజరం లాంటి కేజ్ తయారు చేసేందుకు రెండున్నర మీటర్ల పొడవు, రెండున్నర మీటర్ల వెడల్పు, 2 మీటర్ల ఎత్తులో పెట్టె తయారు చేస్తారు. చేప పిల్లలను ఈ పెట్టెలో ఉంచుతారు. పెట్టె చుట్టూ సముద్రపు కలుపు మొక్కలు కూడా నాటుతారు. వరి సాగు చేసే రైతులకు ఇది మంచి ఎంపిక. వరి పొలంలో నిల్వ ఉన్న నీటిలో చేపల
పెంపకం చేయవచ్చు. ఈ తరహా వ్యవసాయంలో వరితో పాటు చేపల పెంపకం వల్ల కూడా లాభాలు పొందవచ్చు. వరిపంటకు గిట్టుబాటు ధర లభించడమే కాకుండా చేపల విక్రయం ద్వారా కూడా లబ్ధి పొందవచ్చు. అదే క్షేత్రంలో చేపలతోపాటు ఇతర జలచరాల ఉత్పత్తిని ఏకకాలంలో చేపట్టవచ్చు. ఇది వరి ఉత్పత్తిపై ప్రభావం చూపదు. వరి పొలంలో చేపల పెంపకం వల్ల వరి మొక్కలకు వచ్చే అనేక వ్యాధులు
దూరం అవుతాయి.
కేజ్ ఫార్మింగ్‌తో ప్రయోజనాలు..
చేపల అభివృద్ధి గణనీయంగా పెరుగుతుంది.
చేపలు తక్కువ రోజుల్లో పెద్దవి అవుతాయి.
తక్కువ సమయంలో రైతులకు ఎక్కువ లాభం వస్తుంది.
కేజ్ ఎలా ఉండాలంటే..?
రెండు రకాల బోనుల్లో చేపల పెంపకం జరుగుతుంది.
ఒక చోట స్థిరంగా, మరోచోట తేలియాడుతూ ఉంటుంది.
స్థిరమైన పంజరం చేయడానికి నీటి లోతు 5 మీటర్లు ఉండాలి.
తేలియాడే పంజరం చేయడానికి లోతు 5 మీటర్ల కంటే ఎక్కువ ఉండాలి.
ఆక్సిజన్ పుష్కలంగా ఉండాలి.
బోనులో నీటి లోతు 10 అడుగులు ఉండాలి.