జహీరాబాద్, మార్చి 30 : ఒకప్పుడు కూలీ దొరుకని పల్లెలు.. ఏడున్నరేండ్లలోనే ఉపాధి కేంద్రాలుగా మారాయి. బీడు భూములతో బోసిపోయిన పల్లెలు.. ఇప్పుడు పచ్చని పొలాలతో కళకళలాడుతున్నాయి. దీంతో ఖండాలు దాటి స్వగ్రామాలకు చేరుతున్నారు. దీనికి ఉదాహరణ రంజోల్ గ్రామానికి రమేశ్‌రెడ్డి అని చెప్పవచ్చు. ఈయన న్యూజిలాండ్‌లో ఎంబీఏ చదివి అక్కడే ఉద్యోగం చేస్తుండగా తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయనికి ప్రాధాన్యత ఇస్తున్నదని తెలియడంతో అక్కడ ఉద్యోగానికి రాజీనామ చేసి స్వగ్రామనికి చేరుకున్నాడు. ఉమ్మడి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ రైతాంగం హరిగోస పడింది. వ్యవసాయానికి కేవలం రెండు, మూడు గంటల మాత్రమే కరెంట్ సరఫరా చేసేవారు.
రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోయి అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు కొకోల్ల్లాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో రాగానే వ్యవసాయనికి కావాల్సినంత కరెంటు సరఫరా చేయడంతో పాటు సబ్సిడీపై వ్యవసాయానికి సంబంధిచిన పరికరాలు, రైతుబంధు పథకంతో ముందుగానే పెట్టుబడి అందించడంతో రైతులు బంగారు పంటలు పండిస్తున్నారు. వ్యవసాయం దండగ అనుకొన్నవారంతా వ్యవసాయం పండుగ అనేలా చేసింది టీఆర్ఎస్ సర్కార్.

అందరికీ ఆదర్శం రమేశ్ రెడ్డి
న్యూజిలాండ్‌లో 2014చదువుకోని 2016 వరకు అక్కడ ఉద్యోగం చేశారు. ప్రభుత్వం బిందు సేద్యం పరికరాలు, డ్రాగన్ ప్రూట్స్ సాగుకు సబ్సిడీ ఇవ్వడం, తండ్రి నర్సింహారెడ్డి ప్రోత్సాహం తోడవటంతో వ్యవసాయ రంగంలో దూసుకుపోతున్నాడు. బంగ్లాదేశ్ మొక్కలు కొనుగోలు చేసి 7ఎకరాల్లో సాగు చేస్తున్నాడు. మొదట 10రకాలు మొక్కలను సాగు చేశారు. మొక్కలపై పరిశోధన చేసి 80 రకాలు మొక్కలను కొత్త పద్ధతిలో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం 153రకాల మొక్కలను నర్సరీలో పెంచి దేశంలోని వివిధ రాష్ర్టాలతో పాటు ప్రపంచంలోని పలు దేశాలకు మొక్కలను ఎగుమతి చేస్తున్నారు.
ఒక్కసారి వేస్తే 35 సంవత్సరాల వరకు..
డ్రాగన్ ప్రూట్స్ ఒక్కసారి వేస్తే 35సంవత్సరాల వరకు పంట కాలపరిమితి ఉంటుందన్నారు. పంట వేసినప్పటి నుంచి 25సంవత్సరాలు వరకు మంచి దిగుబడి ఉంటుంది. ఎకరానికి మొదటి సంవత్సరం 2టన్నులు, రెండో సంవత్సరం 5 టన్నులు, మూడో సంవత్సరం 8టన్నుల వరకు దిగుబడి వస్తుందని తెలిపారు. ఎక్కువ దిగుబడి రావడానికి రాత్రి సమయంలో మొక్కలకు వేడి వాతావరణం కోసం పొలంలో కరెంట్ దీపాలు ఏర్పాటు చేస్తారు.

డ్రాగన్ ప్రూట్ సాగుతో రూ. 4లక్షల ఆదాయం
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని రంజోల్ గ్రామానికి చెందిన బసంత్‌పూర్ నర్సింహారెడ్డి కుమారుడు రమేశ్‌రెడ్డి. న్యూజిలాండ్‌లో ఎంబీఏ చదివి, ఆ దేశంలో ఉద్యోగం చేసేవారు. కొత్త పద్ధతిలో వ్యవసాయం చేసేందుకు బంగ్లాదేశ్, కోల్కత్త నుంచి డ్రాగన్‌ప్రూట్ (సిరిజెమ్మెడు పండు) మొక్కలు కొనుగోలు చేసి సాగు చేశారు. డ్రాగన్ ప్రూట్ సాగు చేసి ఎకరాకు రూ. 4లక్షల వరకు సంపాదిస్తున్నాడు. వ్యవసాయ క్షేత్రంలో డ్రాగన్ ప్రూట్స్ నర్సరీ ఏర్పాటు చేసి దేశంలోని పలు రాష్ర్టాలకు మొక్కలు సరఫరా చేయడంతో పాటు ప్రపంచంలో అమెరికా, కెన్యా, ఐలాండ్, సింగాపూర్, ఆఫ్రికా దేశాలకు మొక్కలను ఎగుమతి చేస్తున్నారు.
రంజోల్ నుంచి ఇతర దేశాలకు..
రంజోల్ నర్సరీలో పెంచిన మొక్కలను ఆఫ్రికా దేశాలతో పాటు భారత్ దేశంలో ఉన్న పలు రాష్ట్రలకు మొక్కలను సరఫరా చేస్తున్నారు. ఒక్క మొక్క ధర రూ. 60నుంచి రూ. 2000 వరకు పలుకుతుందన్నారు. రమేశ్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో డ్రాగన్ప్రూట్స్ రైతు సంఘం ఏర్పాటు చేసి 300మంది రైతులకు పంట సాగుపై అవగాహన కలిపిస్తున్నారు. పంట సాగు, దిగుబడి కోసం ప్రపంచంలోని 8దేశాల్లో పర్యటించి పరిశోధన చేశారు.

వైన్ తయారీ కోసం ప్రయత్నం
ప్రూట్స్‌తో వైన్ తయారు చేసేందుకు ప్రభు త్వ అనుమతి కోసం దరఖాస్తు చేశాను. ప్రభుత్వ అనుమతి రాగానే వైన్ ఉత్పత్తి చేసేందుకు కంపెనీ ఏర్పా టు చేస్తాను. ఇప్పటికే ప్రూట్స్‌తో వైన్ తయారు చేసేందుకు పరిశోధన చేసి విజయం సాధించాను. సర్కార్ అనుమతి ఇవ్వగానే ఉత్పత్తి చేసి, మార్కెట్లో అమ్మకాలు చేస్తాం. విదేశాల కంటే సొంత గ్రామంలో వ్యవసాయం చేసి తల్లిదండ్రుల వద్ద ఉండటం సంతోషంగా ఉంది.
– రమేశ్‌రెడ్డి, యువ రైతు రంజోల్